Search
Close this search box.

ఐఎఫ్ఎస్ సిందు యాదవ్ ని ఘనంగా సన్మానించిన అఖిల భారత యాదవ మహాసభ నాయకులు.

హైదరాబాద్,డిసెంబర్ 28(జై మాధవ్ న్యూస్):ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో ఐఎఫ్ఎస్ శిక్షణ పొంది ఢిల్లీ లోని (పిఎంఓ) ప్రధానమంత్రి కేంద్ర కార్యాలయంలో అసిస్టెంట్ సెక్రెటరీగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న గడ్డిఅన్నారం మాజీ కౌన్సిలర్ బద్దుల వెంకటేష్ యాదవ్ గారి పుత్రిక *బద్దుల సింధు యాదవ్ గారిని* అఖిల భారత యాదవ మహాసభ, గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్వర్యంలో అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించిన అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్,రాష్ట్ర కార్యదర్శి చిట్టబోయిన లడ్డు యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు ఎం విజయ్ యాదవ్.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ యువజన ఉపాధ్యక్షులు బోళ్ళ రాజశేఖర్ యాదవ్,యువజన ప్రధాన కార్యదర్శులు బండారి తన్మయీ యాదవ్, గడ్డం విశాల్ యాదవ్, తోట మహేందర్ యాదవ్ మరియు కార్యవర్గ సభ్యులు ఎం వెంకట్ యాదవ్, సాయి యాదవ్, ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

Live Cricket Update