Search
Close this search box.

అడ్డగూడూరులో ఘనంగా యాదవ రాజకీయ మేధో మధన సదస్సు

యాదవులు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో ఉన్నతంగా రాణించాల

నల్గొండ, జనవరి 16(జై మాధవ్ న్యూస్): అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎం ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో యాదవుల రాజకీయ మేధో మదన సదస్సును అడ్డగూడూరు యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షులు ఎల్లంల వీరస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చలకాని వెంకట్ యాదవ్ , ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ,వేణు యాదవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు అయోధ్య యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవులు రాష్ట్రంలో ,దేశంలో ఉన్నత వ్యక్తులుగా నిలవాలంటే విద్య ఒకటే ముఖ్యమని, కమ్యూనిటీలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకొని అందరి అభివృద్ధికి తోడ్పడాలని, అంతే కాకుండా పరిపాలనలో భాగస్వాములై, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో గ్రామస్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు పోటీ చేసి గెలిచే విధంగా సహకరించుకోవాలని, ఎలాంటి భూ సమస్యలు ,భూత తగదలు ఉన్న వాటిని కమ్యూనిటీ పరిధిలో కూర్చొని ఎలాంటి వివాదాలు లేకుండా పరిష్కరించుకున్నట్లయితే సమస్యలు లేకుండా పోతాయి అన్నారు. తద్వారా ప్రతి కుటుంబంలోని పిల్లలు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దబడి విద్యా ఉద్యోగాలలో రాణించి దేశ విదేశాల్లో అనేక రకాలుగా ఉద్యోగ అవకాశాలు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కొమ్ము సత్యనారాయణ, పాక సింహాద్రి, మంటిపల్లి సతీష్ యాదవ్ ,కడారి సైదులు, పోలబోయిన లింగయ్య, కన్నెబోయిన ఎలేందర్, లోడంగి మల్లేష్, కడారి నాగరాజు,మార్తా నరేష్, చిగుళ్ళ రమేష్, ననుబోతు మల్లేష్, బాల్నే భిక్షం,సైదులు ,వెంకన్న, మద్ది సత్తయ్య, దావీదు, లింగమల్లు, స్వామి, మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

Live Cricket Update