జై మాధవ్ న్యూస్ (హైదరబాద్ జూలై 2):అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా మారం తిరుపతి యాదవ్ గారి నిరాష్ట్ర అధ్యక్షులు ఐలబోయిన రమేష్ యాదవ్ గారు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్రంలో యాదవ యువతను, యాదవులకు మమేకం చేస్తూ రాజ్యాధికారంలో భాగంగా సంఘటితం చేస్తూ యాదవ సంఘం నిబద్ధతను, పారదర్శకతను పాటించాలని, గత 25 సంవత్సరాలుగా యాదవ సంఘం లో చేస్తున్న సేవలకు గుర్తింపుగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నాలుగు పర్యాయాలు యువత అధ్యక్షుడిగా పనిచేశారని తెలియపరిచారు. నియమాకాన్ని ఉద్దేశించి మారం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ నాకు ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తిగా యాదవుల రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేసే విధంగా నిర్వహిస్తానని రాష్ట్రంలో నా మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు ఐలబోయిన రమేష్ యాదవ్ గారికి, అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబురావు యాదవ్ గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్ గారికి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీందర్ యాదవ్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ…
ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జై కే శేఖర్ యాదవ్ గారికి, పోచబోయిన శ్రీహరి యాదవ్ గారికి, బైకాని శ్రీనివాస్ యాదవ్ గారికి, జాతీయ యువజన కోఆర్డినేటర్ యశ్వంత్ రాజ్ యాదవ్ గారికి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ గారికి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు పలుమారు మల్లేష్ యాదవ్ గార్లకు ధన్యవాదాలు తెలియజేశారు…….