హైదరాబాద్ 27 ఆగస్టు ( జై మాధవ్ న్యూస్):ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 ఎండ్ల అభిషేక్ కుమార్ యాదవ్ ఆహీర్ రెజిమెంట్ పునః స్థాపించాలని భారత దేశం మొత్తం సైకిల్ యాత్ర చేసి యాదవ యువతకు అవగాహన కలిపిస్తు మెలుకొలపాలని సంకల్పించి ఉత్తరప్రదేశ్ ఆగ్ర నుండి సైకిల్ యాత్ర ప్రారంభించడం జరగింది అందులో భాగంగా 12 రాష్ట్రాలో యాత్ర పూర్తి చేసుకొని ఐదు రోజుల క్రితం తెలంగాణ లోని హైదరాబాద్ నగరానికి చేరుకున్న అభిషేక్ యాదవ్ కి స్వాగతం పలికి శాలువాతో సత్కరించిన అఖిల భారత యాదవ మహాసభ, తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్, జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్ మరియు గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు ఎం విజయ్ యాదవ్. అభిషేక్ యాదవ్ తో చర్చించిన అనంతరం తనను అభినందిస్తూ తమ పూర్తి మద్దతు తెలిపి అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ సూచన మేరకు అభిషేక్ యాదవ్ తన సైకిల్ యాత్ర కొనసాగింపునకై 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే మిగిలిన రాష్ట్రాలలో యాత్ర చేసి తిరిగి తన స్వగ్రామం చేరేవరకు అతనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అభిషేక్ యాదవ్ కి హామీ ఇచ్చారు.
అహీర్ రెజిమెంట్ స్థాపన కొరకు భారత్ సైకిల్ యాత్ర చేపట్టిన అభిషేక్ యాదవ్
ఆర్ధిక సహాయం అందించిన అఖిల భారత యాదవ మహాసభ
- jaimadhavnews
- August 28, 2023
- 12:43 am
- No Comments