Search
Close this search box.

సదర్ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు- మహేందర్ యాదవ్

జైమధవ్ న్యూస్ ( హైదరాబాద్, 11 అక్టోబర్):దీపావళి పర్వదినం పురస్కరించుకుని నిర్వహించే సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలని అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాసినట్లు తెలిపారు. బుధవారం ఆయన సైదాబాద్ లోని సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత సంవత్సరం మన్నెగూడలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ప్రకటించడాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఏడాది నవంబర్ లో నిర్వహించే సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి వెంటనే జీఓ విడుదల చేయాలని ఆయన కోరారు.

విలేకరులతో మాట్లాడుతున్న మహేందర్ యాదవ్

సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ కోశాధికారి నేతి శ్రీశైలం యాదవ్,గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి బత్తుల మహేందర్ యాదవ్, ఐ ఎస్ సదన్ డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, సైదాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎం రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

Recent Post

Live Cricket Update