శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 ( జై మాధవ్ న్యూస్): శేరిలింగంపల్లి డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో TLM మేళా.. శేరిలింగంపల్లి మండల పరిధిలోగల వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులచే నిర్వహించినటువంటి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
విద్యార్థుల సృజనాత్మకత, వారి ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవడం కోసం సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుందని కార్పొరేటర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వారి శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు వారి అత్యుత్తమ ఆవిష్కరణను తీసుకురావడానికి ఇది మంచి వేదికగా పనిచేస్తుందని అన్నారు. విద్యార్థులు సమూహాలలో కలిసి పనిచేయడానికి మరియు ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. కార్పొరేటర్ గారితో పాటు ఎంఈఒ వెంకటయ్య, మండల ప్రభుత్వ వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి సైన్స్ ఫెయిర్ ను సందర్శించారు. విద్యార్థుల ప్రతిభను అభినందించి పలు ప్రశ్నలను అడుగుతూ ప్రాజెక్టుల గురించి విద్యార్థులతో చర్చించారు. విద్యార్థులు తమ ప్రాజెక్టుల గురించి విపులముగా వివరించారు. చిన్నారుల ప్రతిభను అభినందిస్తూ, విద్యార్థులు చేసిన వివిధ రకాల నమూనాలను సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించేలా తార్బీనందించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను కార్పొరేటర్ గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, సర్టిఫికెట్లను కార్పొరేటర్ గారు అందజేసినారు. ఈ కార్యక్రమంలో మండల విద్యార్థికారులు వెంకటయ్య, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, ప్రధానోపాధ్యాయులు అనంతరెడ్డి, మహేందర్ రెడ్డి, తాజ్ బాబు, వసుంధర, గోవింద్, బస్వలింగం, తదితర పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంపీపీఎస్ స్కూల్ చైర్మన్ బస్వరాజ్ లింగయ్యత్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.