Search
Close this search box.

కంటి వెలుగు కార్యక్రమం అందరూ సద్వినియోగం చేసుకోండి – డిప్యూటీ కమిషనర్

చందానగర్ (ఫిబ్రవరి 19) జై మాధవ్ న్యూస్: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం గత నెల జనవరి 19 న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమం లో భాగంగా చందానగర్ సర్కిల్ లోని 4 వార్డుల్లో కంటివెలుగు సెంటర్లు ప్రారంభించిన రోజు నుండి కంటి సమస్యలు ఉన్న వారికి నిరాటంకంగా సేవలు అందించడం జరుగుతున్నది.

👉అందులో భాగంగా 107-వార్డు సర్వే ఆఫ్ ఇండియా ఆర్య వైశ్య భవనం, మాదాపూర్ మరియు 111-వార్డు MIG కాలనీ లోని సెంటర్ల లో అర్హులైన వారికి గత కొద్ది రోజుల నుండి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన సేవలు అందించడం జరుగుతున్నది.

👉పైన తెలిపిన సెంటర్లలో అర్హులైన వారికి సేవలు అందించడం గత కొద్ది రోజులుగా జరుగుతున్నందున ఇంకా ప్రజలకు దగ్గరగా సేవలు అందించడం మరియు ఎక్కువ కాలనీ లను కవర్ చేయాలనే ఉద్దేశ్యం తో,

👉 సోమవారం అనగా (20-02-2023) నుండి కొత్త ప్రదేశంలో కి సెంటర్లను మార్చడానికి నిర్ణయించడం జరిగినది

అందులో భాగంగా

👉107 వార్డు సర్వే ఆఫ్ ఇండియా ఆర్య వైశ్య భవనంలో లోని సెంటర్ ను ఖానమేట్ MPP స్కూల్ భవనం లోనికి

👉111 వార్డుMIG కాలనీ లోని సెంటర్ ను 109 వార్డు చందానగర్ సర్కిల్ లోని ఇంజనీర్స్ ఎంక్లేవ్ కమ్యూనిటీ హాల్ భవనం లోనికి మార్చడానికి నిర్ణయించడం జరిగింది.

👉ఈ అవకాశాన్ని కొత్త సెంటర్ల సమీప కాలనీ లోని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకొని చికిత్సలు పొందాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసినా చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

 

Recent Post

Live Cricket Update