ఖమ్మం, జూలై 04 ( జై మాధవ్ న్యూస్): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు దొడ్డి కొమురయ్య త్యాగాల స్ఫూర్తి తో ప్రతి ఒక్కరూ ముందుకుపోవాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యాదవ్ పేర్కొన్నారు. ఖమ్మంలోని చిత్తారు శ్రీహరి యాదవ్ భవన్ లో మంగళవారం చిత్తారు సింహాద్రి యాదవ్ అధ్యక్షతన జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి సభ నిర్వహించి, ఘనంగా నివాలర్పించారు. ఈ సందర్భంగా కోమరయ్య చిత్ర పటానికి పూల మాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిలకల వెంకట నర్సయ్య యాదవ్ మాట్లాడుతూ కొమరయ్య చేసిన ఉద్యమాలను కొనియాడారు. సేవలను, పోరాటాలను స్మరించుకున్నారు. అమరుల ఆశయాల సాధనకు అంకితం కావడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో అశువులు బాసిన తొలి అమరుడు కొమరయ్య అన్నారు. కొమరయ్య తన జీవితాన్ని ప్రజల కోసం అర్పించిన గొప్ప పోరాట యోధుడు అని అన్నారు.వెట్టి చాకిరి విముక్తి కోసం శ్రమించారని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి భావి తరాలకు ఆదర్శమన్నారు. భూమి కోసం భుక్తి కోసం పోరాడి, ప్రాణాలు వదిలిన కొమరయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసికెళ్లాలని అన్నారు.కోమరయ్య ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం అమరుల త్యాగాలను స్మరించుకుంటూ అణగారిన వర్గాలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమరుల త్యాగాల చరిత్రను నిత్యం స్మరించుకొనేలా హైదరాబాద్ నడిగడ్డపై దశాబ్ది ఉత్సవాల చారిత్రక సందర్భంలో ‘తెలంగాణ అమర జ్యోతి’ని ప్రజ్వలనం చేసుకున్నామని గుర్తుచేశారు. అమరుల స్మారకం మనకు నిత్య స్ఫూర్తి నందిస్తుందన్నారు.దొడ్డి కొమురయ్య త్యాగాన్ని స్మరించుకొనే దిశగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వెంకట తెలిపారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్, లోడిగ వెంకన్న యాదవ్ చేతులు నాగేశ్వరావు ,మొర్రి మేకల కోటయ్య , బొల్లి కొమురయ్య, పొదిల సతీష్, సత్తి వెంకన్న, తెల్లబోయిన రమణ, కన్నెబోయిన రవి, మీగడ శ్రీనివాసరావు, ధని యాకుల వెంకన్న బాబు, ధనియాకుల రవి , ధనియాకుల బాబూరావు, ఎం. మల్లేష్, బండారు ప్రభాకర్ ,పొదిలి తిరుపతిరావు, మీగడ గోపి, పొదిలి భూపతి ,మొర్రిమేకల అమరయ్య, సోమ రామారావు , మెండే శ్రీను, రాగం కోటేశ్వరరావు, వాకదాని కోటేశ్వరరావు , యాలగాల నాగేశ్వరావు , పి మురళి తదితరులు పాల్గొన్నారు