Search
Close this search box.

యాదవ జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలి

అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్

హైదరాబాద్ 27 july ( జై మాధవ్ న్యూస్):కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణలలో యాదవుల కుల గణనను చేపట్టాలని అఖిల భారత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్ అన్నారు. హైదరాబాద్ కాచిగూడలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాదవులపై చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 18 శాతంపై ఉన్న యాదవులకు రాబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను యాదవ జనాభా దామాషా ప్రకారం కేటాయించాలన్నారు అంతే కాకుండా అఖిల భారత యాదవ్ మహాసభ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో దశాబ్ద ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత సైనిక బాలగంలో ఆహిర్ రెజిమెంట్ పునః స్థాపించాలి అని దేశ వ్యాప్తంగా దశాబ్ద కాలంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా మన రాష్ట్రం తరుపున కూడా ఆహిర్ రెజిమెంట్ని పునః స్థాపించాలని కేంద్ర ప్రభత్వాని డిమాండ్ చేశారు అలాగే యాదవ కులస్తులంతా కలిసి ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్, ఎం బాల మల్లేష్ యాదవ్, మచ్చ శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శులు బైకన్ శ్రీనివాస్ యాదవ్, ఎడ్ల హరిబాబు యాదవ్, పొచబోయిన శ్రీహరి యాదవ్ కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్ కార్యదర్శులు సి లడ్డు యాదవ్, రావు కుమార్ యాదవ, కన్నె రమేష్ యాదవ్, లీగల్ సెల్ అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్, యువజన అధ్యక్షులు ఐలబోయిన రమేష్ యాదవ్, జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైలకొల్ మహెందేర్ యాదవ్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి మరం తిరుపతి యాదవ్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఈ మనీష్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు ఎం విజయ్ యాదవ్, రాష్ట్ర యువజన కార్యదర్శి యేషాం మల్లేష్ యాదవ్, సంయుక్త కార్యదర్శి ఎం శశి యాదవ్, రాష్ట్ర యువజన కౌన్సిల్ మెంబర్ బద్దుల మణి యాదవ్, గ్రేటర్ యువజన కార్యదర్శి ఆర్ కరణ్ యాదవ్, వివిధ జిల్లాల నుండి రాష్ట్ర కార్యవర్గ సబ్యులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తదితర నాయకులు పాల్గొన్నారు.

Recent Post

Live Cricket Update